Ramesh babu:సినీనటుడు మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022: ప్రముఖ నటుడు మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56) కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్ బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్ బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us