గల్ఫ్ చెర నుంచి మహిళలకు విముక్తి

UPDATED 2nd APRIL 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ చిత్ర హింసలు భరించలేక, అనేక అగచాట్లు పడిన మహిళలకు జిల్లా మానవహక్కుల సంఘం అండగా నిలిచింది. ఈ సందర్భంగా స్థానిక బ్రౌన్ పేట వద్ద జిల్లా మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ తమ సంఘం ద్వారా వివిద గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న సుమారు 16 మంది మహిళలను ఏ విధమైన ఖర్చు లేకుండా ఇండియాకు రప్పించగలిగామని అన్నారు. అక్కడ ఏజెంట్లు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఇక్కడ ఉన్న వారి బంధువులకు అక్కడి మహిళలు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మా సంఘంకు ఫిర్యాదు చేశారన్నారు. మేము విచారణ జరపగా మస్కెట్ ఏజెంట్ సీత అక్కడ మహిళలను కొట్టడం, తిట్టడం, భోజనం, పెట్టకుండా చిత్రహింసలకు గురి చేయడం జరిగిందని మాకు సమాచారం తెలిసిందన్నారు. వెంటనే ఇండియా ఎంబసి కార్యాలయానికి సంఘం ద్వారా ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుపోయిన మహిళలకు రక్షణ కల్పించి వారిని ఇండియా రప్పించాలని మెయిల్ ద్వారా కోరామన్నారు. మేము పంపిన ఫిర్యాదులకు వెంటనే స్పందించి ఇండియాకు పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే చిత్రహింసలకు గురిచేసిన సీత అనే ఏజెంట్ ఫై దర్యాప్తు చేసి పాస్ పోర్ట్ ను బ్లాక్ చేసి ఇండియాకు రాకుండా ఆమెపై తగు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి మోసపూరితమైన సంఘటనలు జరగకుండా చూడాలని కోరామన్నారు. ఎవరైనా గల్ఫ్ దేశాల్లో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మా ఫొన్ నెంబర్: 9440009320 లో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కుంచే నానిబాబు, జుత్తుక అప్పారావు, జొన్నాడ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us