UPDATED 4th NOVEMBER 2022 FRIDAY 5:30 PM
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్, మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లు కూల్చివేస్తుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లు కూలుస్తూ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని, కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందని విమర్శించారు. శనివారం ఇప్పటం గ్రామాన్ని పవన్ కల్యాణ్ సందర్శించబోతున్నారు. అక్కడ ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల్ని పవన్ పరామర్విస్తారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయని వారిని వైసీపీ శత్రువులుగా చూస్తోంది. గత మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు చోటిచ్చి, సహకరించడమే స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి కారణం. అమరావతిలో సభ జరిపేందుకు ప్రయత్నిస్తే, ఆ సభకు చోటు దొరక్కుండా బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ, ఇప్పటం వాసులు సభ కోసం స్థలం ఇచ్చారు. దీంతో వీరిపై కక్ష సాధించేందుకు రోడ్డు విస్తరణ పేరుతో నోటీసులు ఇచ్చారు.







