UPDATED 3rd AUGUST 2022 WEDNESDAY 07:15 PM
Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళవారం రాత్రి గరుడ వాహనసేవ జరిగింది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనసేవలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పారు ఫతేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా టీటీడీ ఆధ్వర్యంలోని స్ధానిక ఆలయాల్లో ఆగస్టులో జరిగే ఉత్సవాలును టీటీడీ ప్రకటించింది.
▪️ ఆగస్టు 5న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.
▪️ ఆగస్టు 5న శ్రీ గోవిందరాజస్వామివారు అహోబిల మఠంలోకి వేంచేపు.
▪️ఆగస్టు 21న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఉట్సోత్సవం.
▪️ఆగస్టు 22న శ్రీ గోవిందరాజస్వామివారి చిన్నవీధి ఉట్లోత్సవం.
▪️ ఆగస్టు 23న శ్రీ గోవిందరాజస్వామివారి పెద్దవీధి ఉట్లోత్సవం.
▪️ ఆగస్టు 31న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవం.







