సతీష్ రాజా సేవలు మరువలేనివి

Updated April 6 Thursday 4.30 pm

పెద్దాపురం : దివంగత వైస్ ఎంపీపీ గోపు సతీష్ రాజా సేవలు మరువలేనివని శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కరరామారావు అన్నారు. మండలంలోని దివిలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు   కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి) ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా సతీష్ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భాస్కరరామారావు మాట్లాడుతూ నీతి నిజాయితీలకు  మారుపేరుగా నిలిచిన మహోన్నత వ్యక్తి సతీష్ రాజా అని కొనియాడారు. మార్కెట్ కమిటి చైర్మెన్  ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), మండల పరిషత్ అధ్యక్షుడు గుడాల రమేష్, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కోటి మాట్లాడుతూ అందరికి అండగా ఉంటూ ప్రజలు శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించిన మహోన్నత వ్యక్తి సతీష్ రాజా అని కొనియాడారు. అలాగే పలువురు వక్తలు సతీష్ రాజా సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.వసంతమాధవి, మండల కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, తిరుపతి సర్పంచ్ మెయిళ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ గోపు అచ్యుతరామయ్య, యండ్రు సత్తిబాబు, కొమ్మిరెడ్డి బుజ్జి, కేదారి నాగేశ్వరరావు (నాగు), రామిశెట్టి శ్రీను, ఎగ్గాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us