Deepika Padukone : కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా వేసిన ఈ నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

𝕌ℙ𝔻𝔸𝕋𝔼𝔻 23𝕣𝕕 𝕄𝔸𝕐 2022 𝕄𝕆ℕ𝔻𝔸𝕐 12:10 ℙ𝕄

Deepika Padukone : ఈ సారి ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి పలువురు తారలు విచ్చేసి రెడ్ కార్పెట్ పై సందడి చేస్తున్నారు. మన దేశానికి చెందిన పలువురు తారలు కూడా ఇప్పటికే రెడ్ కార్పెట్ పై కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు. ఇలాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో హీరోయిన్స్ రకరకాల డ్రెస్ లు, నగలు వేసి అలరిస్తారు. వాటి ధరలు కూడా ఆకాశంలోనే ఉంటాయి.

ఈ సారి వేడుకల్లో భారత్ తరపున దీపికా పదుకొనే జ్యురి మెంబర్ గా కూడా పాల్గొంది.ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పటికే పలు రకాల డ్రెస్సులతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది. రకరకాల డ్రెస్సులతో రెడ్ కార్పెట్ పై నడిచి అందర్నీ అలరించింది. తాజాగా దీపికా బ్లాక్ డ్రెస్ పై వేసిన ఓ నెక్లెస్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

పాతకాలం నాటిగా ఉంటూనే సరికొత్తగా కనిపిస్తున్న ఆ నెక్లెస్ ధర తెలిస్తే మనం వామ్మో అనాల్సిందే. దీపికా బ్లాక్ డ్రెస్ పై పాతకాలం నాటి కడెంలా ఉండే ఓ నెక్లెస్ ని వేసుకుంది. మెడ చుట్టూ అల్లుకున్న ఈ నెక్లెస్ ముందు పులుల ఆకారంలో ఉంది. ఈ నెక్లెస్ ని బంగారం, డైమండ్స్, పచ్చలతో తయారు చేసినట్టు సమాచారం.

ఈ నెక్లెస్ ధర దాదాపు 3 కోట్లు అని తెలుస్తుంది.దీపికా ఒక్క నెక్లెస్ కే అంత ఖర్చు పెట్టింది అంటే ఈ ఫెస్టివల్ మొత్తంలో వేసిన డ్రెస్ లు, నగలు అన్ని కలిపి ఎంత ఖర్చుపెట్టిందో అంటున్నారు నెటిజన్లు. ఇంత ఖర్చుపెట్టినా కాన్స్ లో రెడ్ కార్పెట్ పై హొయలొలికించి అందమైన ఫోటోలు అందరితో షేర్ చేసుకుంది దీపికా.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us