విజిలెన్స్ శాఖ గుర్తించిన ప్రభుత్వ శాఖల బకాయిలు వెంటనే చెల్లించాలి

UPDATED 18th APRIL 2018 WEDNESDAY 6:00 PM

కాకినాడ: జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ గుర్తించిన వివిధ శాఖల అధ్వర్యంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ కోర్టు హాలులో విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంటు శాఖ ద్వారా వివిధ శాఖలు ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ బకాయిలు కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ ద్వారా వివిధ శాఖలు ప్రభుత్వానికి చెల్లించవలసిన సెస్ బకాయిలు ఏవిధమైన నిర్లక్షం లేకుండా సకాలంలో చెల్లించాలని, జిల్లాలోని 24 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ బకాయిలు చెల్లించవలసి ఉందని ఆయన తెలిపారు. పంచాయితీలకు సంబంధించి లేఅవుట్లు, భూమార్పిడి, భూమిశిస్తు, ఎండోమెంట్ శాఖ ద్వారా చెల్లించవలసిన బకాయిలు, జె.ఎన్.టి.యు. అనుబంధ ప్రవేటు కళాశాలలు చెల్లించవలసిన ఫీజులు, పురపాలక శాఖ, కార్మికశాఖ, తదితర శాఖల నుంచి చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. అదే విధంగా జిల్లా గ్రంధాలయ సంస్థకు మున్సిపాలిటీలు చెల్లించవలసిన రూ. 20కోట్ల సెస్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. జె.ఎన్.టి.యు అనుబంధ కళాశాలల నుంచి రూ.14కోట్ల రూపాయల మేర ఫీజులను ఆయా ప్రవేట్ కళాశాలలు చెల్లించవలసి ఉన్నందున వారికి నోటీసులు జారీచేసి మొత్తం వసూలు చేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయితీల్లో ఉన్న ప్రవేటు కళాశాలలు చెల్లించవలసిన సెస్ కూడా చెల్లించాలన్నారు. ఈ బకాయిల చెల్లింపులో కోర్టు వివాదాలను కూడా సత్వరం పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు వారి పరిధిలో ప్రభుత్వానికి చెల్లించవలసిన శిస్తు, ఫీజు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఎసిబి, విజిలెన్స్ కేసులు పెండింగ్ ను సత్వరం పరిష్కరించాలన్నారు. ప్రతి ప్రభుత్వశాఖ విజిలెన్స్ శాఖ ద్వారా ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిల లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ శాఖకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోతే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంటు ఎస్.ఇ ఆర్. గంగాధరరావు మాట్లాడుతూ జిల్లాలో గత 15 సంవత్సరాలుగా రూ.502 కోట్ల మేర బకాయిలు చెల్లింపును విజిలెన్స్ శాఖ గుర్తించిందని, ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖలు రూ.8 కోట్ల మేర బకాయిలు చెల్లించవలసి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి వీరేశ్వరప్రసాద్, గ్రంధాలయ సంస్థ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ కె. శివపార్వతి, ఆర్డీవోలు, మున్సిపల్ కమీషనర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us