ఎంపిడివో కార్యాలయంలో జిల్లా పరిషత్ శత వసంతాల వేడుకలు

UPDATED 17th APRIL 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ఎంపిడివో కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్ శత వసంతాల వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వేడుకల పతాకాన్నిఎంపిపి ఆకునూరి సత్తిబాబు ఆవిష్కరించారు. ఎంపిడివో సి.హెచ్ జగ్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిడివో జగ్గారావు మాట్లాడుతూ జిల్లా పరిషత్ శత వసంతాల వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిఎం, జగన్నాధరావు, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us