ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి : పీవో ప్రవీణ్ ఆదిత్య

రంపచోడవరం, 28 మే 2020 (రెడ్ బీ న్యూస్): గిరిజనులకు గ్రామ సచివాలయాల సంక్షేమ సహాయకులు, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు సయన్వయంతో ప్రభుత్వ పధకాలపై అవగాహన కల్పించి రక్షిత వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. స్థానిక గిరిజన మహిళా సమాఖ్య కార్యాలయంలో మండల పరిధిలోని స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు, గ్రామ సచివాలయాల సంక్షేమ సహాయకులుతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ మైదాన ప్రాంతాలలో కంటే భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలు గురించి ముందుగా గ్రామ వాలంటీర్లు స్వయం సహాయక సంఘాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.అలాగే రక్షిత వర్గాల అర్హతలను పరిశీలించి వారికి ఆయా పధకాలను పర్తింపజేస్తూ ఆయా పథకాల లబ్దిని చేకూర్చాలన్నారు. గ్రామాభివృద్ధికి సచివాలయాల వ్యవస్థ దోహదపడాలన్నారు. వెలుగు విభాగానికి క్షేత్రస్థాయిలో ఎక్కువగా అవగాహన కల్పించే వ్యవస్థ వుండని అందుకు వారి సహకారంతో గ్రామ సచివాలయాల ద్వారా ఉపాధి హామీ,వెలుగు పథకాల ద్వారా గిరిజనులు జీవనోపాధులు మెరుగుదలకు కృషి చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ఉపాధి హామీ పనులకు వెళ్లేలా చైతన్యపర్చాలని, స్వంతంగా ఉద్యాన సాగు చేసుకున్నప్పటికి మూడు సంవత్సరాలుపాటు మొక్కల సంరక్షణ కోసం నిధులు పొందే వెసులు బాటు ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో మహిళా సంఘాలు గ్రామ సచివాలయాల సంక్షేమ సహాయకులు కీలక భూమిక పోషించాలని ఆదేశించారు. అపుడే ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పథకాలు అమలు కాబడి మంచి ఫలితాలు వస్తాయన్నారు.పథకాల అమలులో సమన్యలు ఉత్పన్నమైతే వాటిని అధిగమించే ప్రయత్నం ఎవరిస్థాయిలో వారు చేస్తూ ఉండాలన్నారు. సంఘాలు ఆదాయ వనరులు ఒనగూరే రంగాలలో తమ వద్దనున్న నిధులుతో పెట్టుబడులు పెట్టి పేదరికాన్ని జయించాలని సూచించారు. ప్రభుత్వపరంగా అందుతున్న ఆర్థిక సహాయంతో మరింతగా గిరిజనులు అభివృద్ధి పధంలో పయనించేలా వెలుగు సిబ్బంది కృషిచేయాలన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా నూతన ఒరవడికి నాంది పల్కి మంచి పద్ధతిలో పథకాలు అమలుకు శ్రీకారం చుట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పతకాల అమలు తీరుపై ముందుగా అన్ని రకాలుగా విశ్లేషించుకొని ఏవిధంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఆరీతిలో ప్రభుత్వ నిబందనలు మేర అమలు చేయాలన్నారు. గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లు ద్వారా తమ పరిధిలోని 50 కుటుంబాలకు వివిధ పథకాల గురించి అవగాహన కల్పించడంతోపాటుగా ప్రభుత్వ పరంగా వారికున్న సమస్యలు పరిష్కారానికి, ఆవసరాలు తీర్చడం వాలంటీర్లు భాద్యత అన్నారు. ఏపీడీ వై.సత్యంనాయుడు మాట్లాడుతూ చిన్నతరహా అటవీ ఫలసాయాలు సేకరణ, జీడిపిక్కల ప్రోసెసింగ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు స్వయం సహాయక సంఘాలు ద్వారా బ్యాంకు రుణాలు ప్రభుత్వపరంగా రుణాలు ఇప్పించడంతోపాటు వారికి వైఎస్ఆర్ పెళ్లికానుక, భీమా పథకం, మన కిరాణా, మనసేవా కేంద్రాలు,తదితర కార్యక్రమాలు ద్వారా గిరిజనులను అభివృద్ది పధం వైపు పయనించేలా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. కరోనా నియంత్రణ గురించి ఎడిఎంహెచ్ వో వినోదకుమార్ అవగాహన కల్పించారు. ఉపాధిహామీ పనులు పెంచేందుకు ఎంపీడీవోలు గిరిజనులలో ఏవిధంగా చైతన్యాన్ని తీసుకుని రావాలన్న అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us