కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు నాక్ గుర్తింపు

UPDATED 21st JUNE 2017 WEDNESDAY 4:00 PM

పెద్దాపురం: ఇంజనీరింగ్ విద్యా  వ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్న పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపు లభించినట్లు కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం. శర్మ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మే నెల 18,19, 20 తేదీల్లో నాక్ బృందం కళాశాలను పరిశీలించింది. కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, అధునాతన ప్రయోగశాలలు, పరిశోధనాత్మక ప్రయోగశాలలు , విద్యార్థులకు అందించే వసతులు, కళాశాల తరఫున ఏర్పాటు చేసే సామాజిక సేవా కార్యక్రమాలు మొదలైన వాటిని కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం నాక్ బృందం సంతృప్తి వ్యక్తం  చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలకు నాక్ బి+ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కళాశాలకు గుర్తింపు రావడానికి కృషి చేసిన అధ్యాపక సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us