ఆదిత్య ప్రొఫెసర్లకు అభినందనల వెల్లువ

UPDATED 24th JANUARY 2018 WEDNESDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలకు చెందిన పలువురు అధ్యాపకులకు కాకినాడ జె.ఎన్.టి.యు ఆరవ స్నాతకోత్సవంలో పి.హెచ్.డి, డాక్టరేట్ పట్టాలు పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మెకానికల్ విభాగం నుంచి ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వి.వి. కామేష్, ఈఈఈ విభాగం నుంచి డాక్టర్ వి. శ్రీనివాసరావు, కంప్యూటర్ సైన్స్ విభాగం నుంచి డాక్టర్ ఆర్.వి.ఎస్. లలిత, ఫార్మసీ ఫాకల్టీ డాక్టర్ పాలాక్షలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్ చేతుల మీదుగా పి.హెచ్.డి, డాక్టరేట్ పట్టాలు అందుకున్నారని ఆయన తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ వీరి శిక్షణలో విద్యార్థులు మంచి నాణ్యమైన విద్యను పొందుతారని, అలాగే భవిష్యత్తులో వీరు మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ఆదిత్య విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, తదితరులు వీరికి అభినందనలు తెలియచేశారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us