వైభవంగా సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం!

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని సత్యదేవుడి సన్నిధిలో స్వామి అమ్మవార్లు ఉత్తర ద్వారం మీదుగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున రెండు గంటలకు స్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి అభ్యంగన స్నానం ఆచరింపజేసి నూతన పట్టువస్త్రాలను ధరింపజేశారు. నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు ప్రధాన ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అయిదు గంటల నుంచి భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. శేషపాన్పుపై పవళిస్తున్న విష్ణుమూర్తిగా సత్యదేవుని, ఆయన పాదాలను సుతిమెత్తగా ఒత్తుతున్న దేవేరిగా అమ్మవార్లను అలంకరించారు. వేలాదిగా భక్తులు స్వామివార్ల దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్బంగా ఉత్తర ద్వార మార్గాన్ని, ప్రధాన ఆలయాన్ని పుష్పాలతో అలంకరింపజేశారు. ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, ఇన్చార్జి ఈవో సురేష్‌బాబు పాల్గొన్నారు. అనంతరం 10 గంటలకు స్వామి అమ్మవార్లను వెండి రథంపై ఆలయ ప్రధాన రాజగోపురం చుట్టూ భక్తుల గోవింద నామస్మరణతో పండితుల ఆధ్వర్యంలో ప్రదక్షిణ చేయించారు. వాడపల్లి వెంకన్న ఆలయంలోనూ భారీ సంఖ్యలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us