UPDATED 21 JANUARY 2022 FRIDAY 02.30 PM
గుడివాడ (రెడ్ బీ న్యూస్): గుడివాడ ఉద్రిక్తతగా మారింది. కేసినో వ్యవహారంపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ బృందంపై వైసీపీ రాళ్ల దాడికి దిగింది. మరోవైపు టీడీపీ నేతలను పోలీసులు అడుగుడుగున అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పార్టీ కార్యాలయం నుంచి కె కన్వెన్షన్‌కు టీడీపీ నేతలు బయలుదేరారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పోటీగా ర్యాలీగా టీడీపీ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. అడ్డుకున్న పోలీసులను నెట్టేసి టీడీపీ శ్రేణులవైపు దూసుకొచ్చారు. పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఈ ఘటనలో బోండా ఉమ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.







