వ్యక్తిత్వ వికాసం పై అవగాహన

UPDATED 25th MAY 2017 THURSDAY 5:00 PM

పెద్దాపురం: టిటిడి నిర్వహణలో వ్యక్తిత్వ వికాస శిబిరం స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ లో జిల్లా స్ధాయిలో జూన్ మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్నట్లు హిందూ ధర్మ ప్రచార మండలి సహాయ కార్యదర్శి రేపాక ప్రసాద్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 8,9,10 తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిబిరంలో భారతీయ సనాతన ధర్మం, మానవీయ నైతిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు మొదలైన విషయాలలో తర్ఫీదు పొందిన ఆధ్యాపకులచే వారం రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఉచిత వసతి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా బాలురకు శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్( పెద్దాపురం), బాలికలకు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ (దివాన్ చెరువు,రాజమహేంద్రవరం) లో వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని  జిల్లాలో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 92472 21354, 70137 45927 నెంబర్ లలో సంప్రదించాలని ఆయన కోరారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us