అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021 : విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణ.. ముందస్తు బెయిలు కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఈ ఉదయం ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. మరోవైపు రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన సీఐడీ అధికారులు.. ఈరోజు విచారణకు హాజరుకావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చారు







