UPDATED 12th FEBRUARY 2018 MONDAY 10:00 PM
సామర్లకోట: మహిళా ఛాతిలో ఏర్పడ్డ ఏడున్నర కేజీల కణితిని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం సూర్యా గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు శ్రమించి తొలగించారు. సామర్లకోటకు చెందిన లక్ష్మి అనే మహిళకు సుమారు ఐదు సంవత్సరాల క్రితం కడుపులో కణితి ఏర్పడింది. ఇది ప్రమాదకరమని కొందరు స్థానిక వైద్యులు చెప్పినా ఆమె ఆపరేషన్ అంటే భయంతో ఇంతకాలం నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అయితే కణితి వల్ల రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. చివరికి వేరొకరి సహాయం లేకుండా కదల్లేని స్థితికి చేరింది. చివరకు బంధువుల సహాయంతో మాధవపట్నంలో సూర్య గ్లోబల్ హాస్పిటల్ సంప్రదించారు. ఆ కణితి సిస్టోస్ ఆర్కోమాగా గుర్తించారు. తక్కువగా ప్రారంభమై ఎక్కువ అయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ బి.హెచ్. పి.ఎస్. వీర్రాజు ఆమెకు ధైర్యం చెప్పి అత్యవసర పరిస్థితుల్లో ఐదు యూనిట్ల రక్తాన్ని ఎక్కించి రెండు గంటలసేపు శ్రమించి 7.5 కేజీల కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు.







