వైభవంగా ప్రారంభమైన బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం

ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 25 ఆక్టోబర్ 2021: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కోనసీమ తిరుమల.. వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో అంకురార్పణ చేశారు. సంకల్పం మొదలు అగ్నిప్రతిష్ఠాపన తదితర పూజలన్నీ కనుల పండువగా జరిగాయి. దేవేరులతో కలసి దేవదేవుడు ప్రసన్న వదనంతో సకల లోకాల్ని ఆశీర్వదించారు. రాత్రి స్వామివారు శేషవాహనంపై పరావాసుదేవ అలంకారంలో తిరువీధుల్లో విహరించారు. ఈ ఘట్టాన్ని భక్తకోటి కనులారా వీక్షించి పునీతమైంది. విప్‌ చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, పాలకమండలి ఛైర్మన్‌ రమేష్‌రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us