ఒక్క పాట కోసం రూ.5 కోట్లు

రెడ్ బీ న్యూస్, 15 డిసెంబర్ 2021: స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఈసారి బాక్సాఫీస్ లెక్కలు మార్చడంలో తగ్గేదేలే అంటున్న ఈ ఇద్దరు పుష్ప సినిమా మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. కన్నడ భామగా రష్మిక టాలీవుడ్ లో తన ఫాం కొనసాగిస్తుంది. అయితే పుష్పలో ఒక హీరోయిన్ డోస్ సరిపోదు అన్నట్టు సెకండ్ హీరోయిన్ గా సమంతని తీసుకున్నారు. అఫ్కోర్స్ సమంత చేసింది కేవలం ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే అయినా ఆ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. పుష్పలో సమంత ఊ అంటావా మావ సాంగ్ కోసమే దాదాపు 5 కోట్ల దాకా ఖర్చు చేశారట. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి ఈ సాంగ్ షూట్ చేశారట. ఈ సాంగ్ కోసం సమంత కూడా కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఊ అంటావా సాంగ్ సెట్.. డ్యాన్సర్స్.. ప్రాపర్టీస్ సమంత రెమ్యునరేషన్ తో కలుపుకుని ఈ ఒక్క పాట కోసమే 5 కోట్ల దాకా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. పుష్ప రాజ్ మాస్ జాతరకి ఆడియెన్స్ అంతా సిద్ధం కాగా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ లెవల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తున్న పుష్ప టీం ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీద కూడా టార్గెట్ పెట్టుకుంది

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us