Anam Ramanarayana Reddy : నేను ఎమ్మెల్యేనా? కాదా? మరోసారి బరస్ట్ అయిన వైసీపీ సీనియర్ నేత

Updated 29th December  2022 Thusrsdy  91

Anam Ramanarayana Reddy : మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేనా? కాదా? క్లారిటీ ఇవ్వాలని నియోజకవర్గ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఎమ్మెల్యేను పెట్టేశారా? అని సత్యనారాయణ రెడ్డిని ప్రశ్నించారు. తాను ఉండగానే మరొకరు కాబోయే ఎమ్మెల్యే అని చెప్పుకోవడం ఏంటని? నిలదీశారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కుర్చీ లాగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సమన్వయలోపం ఉందని, దీన్ని సరిదిద్దాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు.

కొన్ని పత్రికల్లో మన వాళ్లే రాబోయే రోజుల్లో నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని స్టేట్ మెంట్లు ఇస్తున్నారా? నేను ఎమ్మెల్యేగా ఉన్నానా? లేనా? అనే అనుమానం నాకూ కలిగింది. నువ్వేనా ఎమ్మెల్యే? కొత్త వాళ్లు వచ్చారా? అనే అడిగే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం అంతా నేను రోడ్ల మీద పడి, కాల్వల మీద పడి గడప గడపకి తిరుగుతూ.. నేను చేయాల్సిన పని ఏంటో నాకు కూడా తెలియదు. ఇటువంటి సందర్భాలు వస్తున్నాయి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ హాట్ కామెంట్స్ తో పార్టీ నాయకులు అవాక్కయ్యారు.

నేను ఎమ్మెల్యేనేనా? అని పార్టీ పరిశీలకుడిని సీనియర్ నేత అయిన ఆనం స్పష్టత కోరడం, ‘నేను ఎమ్మెల్యేనేనా? కాదా? అనే అనుమానం వస్తోందని కామెంట్ చేయడం.. అధికార పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us