వాహనదారులు విధిగా లైసెన్సులు పొందాలి

UPDATED 24th NOVEMBER 2017 FRIDAY 8:00 PM

గండేపల్లి: వాహనాలు నడిపేవారు విధిగా డ్రైవింగ్ లైసెన్సులు పొందాలని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ వి. పద్మాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎల్ ఎల్ ఆర్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిఎస్పీ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ వ్యక్తి ఏ వాహనం నడపాలన్నా విధిగా లైసెన్స్ పొందాలని, లైసెన్స్, హెల్మెట్ లేకుండా, సెల్ మాట్లాడుతూ వాహనం డ్రైవింగ్ చేయరాదన్నారు. మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ పద్మాకర్ మాట్లాడుతూ లైసెన్స్ పొందేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ స్కూల్ కి వెళ్లాలని, ఎల్ ఎల్ ఆర్ లైసెన్స్ పొందిన ఆరు నెలల్లో శాశ్వత లైసెన్స్ పొందాలన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ప్రొఫెసర్ వై. జైబాబు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us