Updated 12th April 2017 Wednesday 11:30PM
పెద్దాపురం: అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దాపురం మండలం గోరింట శివారులో బుధవారం అర్థరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోరింట గ్రామానికి చెందిన బఱ్ఱె శ్రీనివాస్(40 ) రోడ్ పై విగతజీవిగా పడిఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఇలాఉండగా మృతుడి తలపై బలమైన గాయాలు కనిపించడంతో ఎవరో హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.







