Crime News: వరంగల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అన్నా చెల్లెలు మృతి

నర్సంపేట (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: వరంగల్‌ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ లారీ ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న అన్నా చెల్లెలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఖానాపురం మండలం దబ్బిర్‌పేట గ్రామానికి చెందిన మొగుళ్లపల్లి రాకేశ్‌ బాబు, ప్రసన్న ఓ వివాహ వేడుకకు హాజరై స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. నర్సంపేట మండలం లక్నెపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అన్నా చెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో దబ్బిర్‌పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్‌ లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us