Peddapuram Tahasildar : బాణాసంచా దుకాణాలు నిబంధనలు మీరితే చర్యలు తప్పవు

▪️ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర

UPDATED 21st OCTOBER 2022 FRIDAY 06:00 PM

Peddapuram Tahasildar : దీపావళి పండుగ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దాపురం తహసీల్దార్ వజ్రపు జితేంద్ర హెచ్చరించారు. స్థానిక విలేఖరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ దీపావళి (Diwali) పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాలలో వ్యాపారులు నియమనిబంధనలు పాటించాలని, నిర్ధేశించిన ప్రదేశంలో మాత్రమే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు, దుకాణాలు ఏర్పాట్లను రెవిన్యూ, ఫైర్, పోలీస్ అధికారులు సంయుక్తంగా పరిశీలించి ధృవీకరించిన అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి వాటికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతీ షాపునకు మధ్య 3 మీటర్ల దూరం తప్పనిసరిగా ఉండాలని, దీపావళి పండుగ సందర్భంగా రెండు రోజులు మాత్రమే దుకాణదారులు బాణాసంచాను ఉదయం నుంచి సాయంత్రం వరకూ విక్రయించుకోవచ్చన్నారు. షాపులు ఏర్పాటు చేసుకోవడానికి నిబంధనల మేరకు ఫస్ట్‌ కం ఫస్ట్‌ కేటాయింపు చేయడం జరుగుతుందని తెలిపారు.

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ చేసినా, తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us