UPDATED 12th AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణం స్థానిక బ్రౌన్ పేటలో ఉన్న పశు కబేళాను మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ కబేళా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే కబేళా పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు హబీబుల్లా, తదితరులు పాల్గొన్నారు.







