KTR: వరంగల్‌కు జెన్‌పాక్ట్‌.. కేటీఆర్‌ హర్షం

వరంగల్‌ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు యూఎస్‌కు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌తో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే సైయంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్ నుంచి ఆపరేట్ చేస్తుండగా.. వీటి సరసన జెన్‌పాక్ట్‌ చేరనుంది. వచ్చే ఆరు నెలల్లో వరంగల్‌లో ఈ టెక్ సెంటర్ సేవలను ఆరంభించనుంది. దీంతో వరంగల్‌లో కొత్తగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. జెన్‌పాక్ట్‌ రాకతో వరంగల్‌లో ఐటీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us