AP News: అమరావతి రైతుల పిటిషన్‌పై హైకోర్టులో రేపు విచారణ

అమరావతి (రెడ్ బీ న్యూస్) 24 డిసెంబర్ 2021: తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుంది. మరోవైపు మహాపాదయాత్రలో పాల్గొన్న అమరావతి రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అనుమతి ఇచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని స్పష్టం చేసింది. రేపు ఒక్కరోజే మొత్తం 500 మంది దర్శనానికి అనుమతి లభించింది

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us