ఇజ్రాయెల్‌లో ‘ఫ్లోరోనా’ వ్యాధి.. తొలి కేసు నమోదు

జెరూసలెం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ... ఇజ్రాయెల్​లో ‘ఫ్లొరోనా’ వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి ఫ్లొరోనా కేసు వెలుగుచూసింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ వార్తా సంస్థ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఫ్లొరోనా అంటే కొవిడ్-19, ఇన్​ఫ్లూయెంజా డబుల్ ఇన్​ఫెక్షన్ అని అర్థం. ఇజ్రాయెల్​లో ఈ తరహా కేసు వెలుగు చూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. మరోవైపు.. ఇజ్రాయెల్​లో కరోనా టీకా నాలుగో డోసును అందించే ప్రక్రియ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్​ టీకాల ద్వారా అందిన రోగనిరోధకశక్తి క్షీణించడంతో నాలుగో డోసు వేసే ప్రక్రియను ప్రారంభించామని ఇజ్రాయెల్​ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్​మన్ యాష్ పేర్కొన్నారు. తమ దేశప్రజలకు మూడో డోసు టీకా అందించి నాలుగు నెలలు దాటిందన్నారు. ఇజ్రాయెల్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కొత్తగా దాదాపు 5,000 కేసులు నమోదయ్యాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us