KCR, Uddhav :ఉద్ధవ్‌తో కేసీఆర్ భేటీ

UPDATED 20 FEBRUARY 2022 SUNDAY 03:30 PM

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబైలోని వర్షా బంగ్లాలో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. కేసీఆర్ వెంట మంబై వెళ్లిన వారిలో రంజిత్ రెడ్డి, బి. బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి కట్టేందుకు ముందడుగు వేసిన కేసీఆర్ అందులో భాగంగానే ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఉద్ధవ్ కేసీఆర్‌కు ఫోన్ చేసి బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us