UPDATED 28th MARCH 2018 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం సిరివాడ గ్రామంలో స్థానిక రామాలయంలో భగవద్గీత పారాయణ కార్యక్రమం బుధవారం జరిగింది. లోక కల్యాణార్థం గ్రామ గ్రామాన గీతా ప్రచారంలో భాగంగా భగవద్గీత సేవాసమితి, పెద్దాపురం వ్యవస్థాపకులు మల్లికార్జునస్వామి ఆధ్వర్యంలో గీతాపారాయణం, ప్రవచనం, సంకీర్తనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామి మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే ప్రతీ ఒక్కరూ భగవద్గీతను తప్పనిసరిగా పారాయణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పారాయణ సభ్యులు నేతి వీరభద్రరావు, ఆర్గనైజర్ సత్య కుమార్, టి. సత్యనారాయణ, పిచ్చెట్టి నూకామణి, ముమ్మన జంగమయ్య, రామాలయ కమిటీ సభ్యులు, సీతా రామాంజనేయ బాలభక్త భజన సమాజం, మహిళా భక్త సమాజం, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.







