UPDATED 14th MARCH 2022 MONDAY 02:59 PM
Brother Anil Kumar: ప్రముఖ మత బోధకుడు, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. విశాఖలో పలు సంఘాల నేతలతో బిజీ బిజీగా గడుపుతన్నారు. ఉత్తరాంధ్ర ఎస్సి, ఎస్టీ, బీసీ సంఘాల నేతలతో బ్రదర్ అనిల్ కుమార్ సోమవారం సమావేశం అయ్యారు. ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం అయిన అనిల్ కుమార్ విజయవాడలోనూ పలు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు.
ఈక్రమంలో నేడు విశాఖలో నిర్వహించిన మీటింగ్ కు ఆసక్తికరంగా మారింది. సమావేశ విరామ సమయంలో బ్రదర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ఎస్సి, ఎస్టీ, బీసీ సంఘాల నేతలతో సమావేశం అయ్యానని..తమ పరిస్థితిని వినేవాళ్ళు ఎవరు లేరని నేతలు చెప్పుకొచ్చారని అనిల్ కుమార్ అన్నారు. ఎన్నికల ముందు వాళ్ళ సహాయం అడిగానన్న అనిల్ కుమార్.. ఎన్నికల అనంతరం ఆ సంఘాలు తమ ఆకాంక్షలు నెరవరలేదని అసంతృప్తి గా ఉన్నట్లు తెలిపారు.
పాఠశాల వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన మార్పులతో.. క్రిస్టియన్ చారిటీ నిధులతో నడుస్తున్న పాఠశాలలు నష్టపోతున్నాయని ఆయా సంఘాల వారు తన దృష్టికి తీసుకువచ్చినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై తమ సమస్యను విన్నవించుకునేందుకు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరినా..ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోవడంలేదని ఆయా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బ్రదర్ అనిల్ తెలిపారు.







