మున్సిపల్ కమీషనరుకు ఎక్సలెన్స్ అవార్డు

www.redbeenews.com

UPDATED 26th JULY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావుకు రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో బుధవారం ప్రధానం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో సామర్లకోట మున్సిపాలిటీ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున కమీషనరును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ తనకు ఇంతటి అరుదైన అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us