మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 
* గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

UPDATED 31st OCTOBER 2018 WEDNESDAY 6:30 PM

పెద్దాపురం: మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ఘనత ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని గుడివాడ గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన  కమ్యూనిటీ భవనం, రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో పాఠశాల అదనపు తరగతి గదిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంబటి సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రతీ పేదవాడికి సొంతింటి కల సాకారం చేయడానికి ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ పధకం కింద ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని, గుడివాడ గ్రామంలో ఎన్టీఆర్ గృహ పథకం కింద గృహాలు నిర్మించామని అన్నారు. గ్రామంలో 30 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వవలసి ఉందని, వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో గుడివాడ గ్రామంలో రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. గ్రామంలో పార్కు నిర్మాణాన్ని చేపడతామని, ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామని, డ్వాక్రా రుణమాఫీ చేశామని అన్నారు. ఎన్నడూ లేని విధంగా కాపు కార్పోరేషన్ ద్వారా రూ.3 వేల కోట్లతో కాపులను ఆదుకున్నామని, బిసి, ఎస్సీ కార్పోరేషన్ల ద్వారా రుణాలను అందిస్తున్నామని అన్నారు. పింఛన్లు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్స్, ఉచితంగా వైద్య సేవలు, చంద్రన్నబీమా పథకం, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం, ఉచిత విద్య, అంగన్వాడీ భవనాలు, సిసి రోడ్లు తదితర సంక్షేమ పథకాలను అన్ని గ్రామాలలో అమలు చేస్తామని చెప్పారు. గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలని ,పారిశుధ్య మెరుగుకు ప్రజలు సహకారం అందించాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, ఎంపీపీ గుడాల రమేష్, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), కమ్మిల సుబ్బారావు, పంచాయతీ రాజ్ డిఈ హరినాథరావు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us