ఎంపిపి మార్త సేవలు మరువలేనివి

UPDATED 14th FEBRUARY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి సామర్లకోట మండల ఎంపిపిగా గొడతా మార్త సేవలు మరువలేనివని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో వైస్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన పాల్గొని బుధవారం మాట్లాడారు. ముందుగా మార్త చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి సంతాపం తెలియచేశారు. మండల అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడారు. అభివృద్ధికి చిరునామాగా ఆమె అందించిన సేవలు ఆమోఘమని కొనియాడారు. ప్రమాదవశాత్తు ఆమె మృతి చెందడం దురదృష్టకరమన్నారు. అనంతరం పలువురు ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట, పెద్దాపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనుబాబు, ఎఎంసి వైస్ ఛైర్మన్ అడబాల చిట్టిబాబు, జెడ్పిటిసి సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ, పెద్దాపురం ఎంపిపి గుడాల రమేష్, మన్యం చంద్రరావు, ఎంపిడివో బి.నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ శ్రీనివాసు, ఈవోపీఆర్డీ సి.హెచ్. జగ్గారావు, ఎంఈవో కె. వెంకటరమణమ్మ, తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ డీటీ ఎన్.ఎస్.ఎన్. ప్రసాద్, ఉపాధిహామీ, వెలుగు కార్యాలయల సిబ్బంది, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us