* జనసేన నాయకులకు అధినేత పవన్ సూచన
UPDATED 2nd NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లాలో చేపట్టిన తొలి విడత యాత్రలో భాగంగా తుని వెళుతున్న ఆయనకు సామర్లకోట రైల్వేస్టేషన్‌లో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్దాపురం నియోజకవర్గ నాయకులు తుమ్మల రామస్వామి(బాబు) ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు, యువకులు ముందుగా రైల్వే స్టేషన్‌లోని ఒకటవ నంబరు ప్లాట్ ఫారం పైకి చేరుకున్నారు. తమ నేత జన్మభూమి రైల్లో వస్తున్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు రైల్వేస్టేషన్‌కు చేరుకుని జనసేన పార్టీ జెండాలతో సందడి చేశారు. పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న భోగీ ఫ్లాట్‌ఫాంపై ఆగే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం రైలు ఫ్లాట్ ఫాంకు చేరుకుంటుండగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. పెద్దఎత్తున జేజేలు పలుకుతూ నినాదాలు చేస్తూ అభిమాన నేతకు ఆహ్వానం పలికారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తుమ్మల రామస్వామి(బాబు) పవన్ కల్యాణ్ కు పుష్పగుచ్ఛం అందించారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అండగా నిలవాలంటూ పవన్ సూచించారు. అనంతరం భోగీ తలుపు వద్దకు వచ్చి అభిమానులకు తనదైన శైలిలో అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులను చూసి పిడికిలి బిగించి పైకెత్తి చూపుతూ ఉత్సాహం నింపారు. పలువురు అభిమానులు సమస్యలపై వినతి పత్రాలు అందించారు. అనంతరం పవన్ రైలులో తునికి పయనమై వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు మారిశెట్టి రాఘవయ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ చింతల పార్థసారథి, మెగా ఫ్యామిలీ ఫాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎస్. ఉదయకుమార్, అధ్యక్షుడు తుమ్మల ప్రసాద్, ఉపాధ్యక్షుడు సిహెచ్ నాగేశ్వరరావు, కార్యదర్శి సరోజ్ వాసు, వెదురుపాక మార్తాండ టాగూర్, జాయింట్ సెక్రటరీ బి. నానాజీ, ట్రెజరర్ ఎండి షఫియుల్లా, నాగేశ్వరరావు, దుర్గా, అల్లిమిల్లి శ్రీను, తిక్కిరెడ్డి కాశీ, జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ శెట్టిబత్తుల రాజబాబు, పేసంగి ఆదినారాయణ, జనసేన మహిళా నాయకులు కడలి ఈశ్వరి, చల్లా లక్ష్మీ, తోలేటి శిరీష, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







