Updated 24th January 2024 Wednesday 2.10 pm
Jagananna Arogya Suraksha : వైసీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్లు మండపేట పురపాలక సంఘ చైర్ పర్సన్ పతివాడ నూకదుర్గారాణి అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha) శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. స్థానిక 8వ వార్డు హరిజనపేటలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ (Urban Health Centre) లో 1,2,3 వార్డులకు ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని ఉద్దేశ్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే పట్టణ పరిధిలో ఈ శిబిరాలను సచివాలయాల వారిగా నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పధకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత బలోపేతం చేస్తూ రూ. 5 లక్షల పరిమితి నుంచి రూ.25 లక్షల వరకూ పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందన్నారు. వైద్య సహాయం పొందిన వారికి డాక్టర్ రాసిన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంగమ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాసు, కౌన్సిలర్లు పోతంశెట్టి ప్రసాద్,చిట్టూరి సతీష్, వైస్సార్సీపీ నాయకులు అమలదాసు రుద్రమూర్తి, డా.రమ్య లక్ష్మీ, హెల్త్ సూపర్ వైజర్ అనంతలక్ష్మి, సచివాలయ కన్వీనర్ జుత్తుక లీల, హాస్పిటల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







