UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 07:50 AM
అమరావతి (రెడ్ బీ న్యూస్): సీఐడీ చరిత్రలో చిన్న నేరంపై ఏడు కేసులు పెట్టారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు. సీఐడీ అధికారులు సమ్మెపై విచారించారని…తనపై పెట్టిన కేసు గురించి తక్కువగా మాట్లాడారన్నారు. తనపై కక్షపూరితమైన చర్యలు ఆపాలన్నారు. ఉద్యోగ సంఘాల సమ్మెలో తన పాత్ర లేదని…వారు కోరితే మద్దతిస్తామని చెప్పామన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగిస్తే ప్రభుత్వం కనుమరుగవడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ సర్వీసులో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై అశోక్‌బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.







