Crime news: శబరిమల వద్ద ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి

శబరిమల (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: శబరిమల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్నూలులోని బుధవారపేటకు చెందిన ఇద్దరు భక్తులు దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను బుధవారపేట, దేవనగర్‌కు చెందిన ఆదినారాయణ, శంకర్‌గా గుర్తించారు. అయ్యప్ప సన్నిధికి టెంపో వాహనంలో వెళ్తుండగా శబరిమలకు 60 కి.మీల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us