ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 22నవంబర్ 2021: వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రంలో ఆదివారం స్వామి కల్యాణం కనులపండువగా జరిగింది. బ్రహ్మముడులు, కంకణధారణ, సూత్ర, యజ్ఞోపవీతధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను అర్చకులు రమణీయంగా జరిపించారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత అష్టోత్తర శతనామావళి పూజలు జరిపారు.







