Updated 21st April 2017 Friday 1:30 PM
పెద్దాపురం: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్ ) ఆద్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దాపురం మండలం కట్టమూరు పిఎసిఎస్ అధ్యక్షుడు చల్లా చిన వీర్రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కట్టమూరు జంక్షన్ లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో పి.ఎస్.వి.ఎన్ ఆచార్యులు, పిట్టు రంగారావు తదితరులు పాల్గొన్నారు.







