ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి : పీవో ప్రవీణ్ ఆదిత్య

రంపచోడవరం,29 మే 2020 (రెడ్ బీ న్యూస్): గ్రామ పాలన ప్రజలవద్దకు చేర్చేందుకు గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది సమస్యయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్, ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆన్నారు. స్థానిక ఐటీడీఏ నుంచి వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తాహశీల్దార్లు, బ్రాంచ్ పోస్టల్ అధికార్లు, గ్రామ సచివాలయాలు సిబ్బంది. ఉపాధి హామీ సిబ్బంది, రెవిన్యూ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు.ఉపాధి హామీ వేతనాలు, జాబ్ కార్డులు జారీ, గ్రామ సచివాలయాలలో విధుల నిర్వహణ,పంటల సాగుదారుల నమోదు కార్డులు,రైస్ కార్డులలో మార్పులు, చేర్పులు, ఆన్ లైన్ డేటా ఎంట్రీలు, ఆధార్ ఈకేవైసీ వంటి అంశాలపై అవగాహన కల్పించి వాటి పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పారదర్శక పాలన కొరకు ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చిందని దాని ద్వారా కార్యదర్శులు గ్రామ వాలంటీర్లు ప్రజాసేవకై పునరంకితం కావాలని ఆదేశించారు. పేదరిక నిర్మూలన దిశగా చర్యలు గ్రామ సచివాలయాలు ద్వారా చేపట్టాలన్నారు.మీసేవ కేంద్రాలుల్లో గతంలో నిర్వహించే పనులు అన్నింటిని ఇకపై గ్రామ సచివాలయాలలో చేపడుతున్నారన్నారు. గ్రామ వాలంటీర్లుకు 50 కుటుంబాలలో ప్రభుత్వపరంగా కావాల్సిన సేవలు అన్నింటిని సేకరించి వాటి పరిష్కారానికి గ్రామ సచివాలయాల ద్వారా చర్యలు చేపట్టి న్యాయం చేకూర్చుతారన్నారు. ఇకపై ప్రభుత్వ మండల కార్యాలయాలలో పనుల నిమిత్తం ఉద్యోగులు చుట్టూ ప్రజలు తిరగాల్సిన పని ఉండదన్నారు.గ్రామ వాలంటీర్లు సంక్షేమ పథక ఫలాలు నేరుగా ప్రజలకు చేరవేయడమే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థల ద్వారా పాటుపడాలన్నారు. పధకాలపై అవగాహన కల్పించి వాటికి అర్హులైన వారిని ఎంపిక చేసి ఆయా సంక్షేమ ఫలాలు అందజేయాలన్నారు. నరేగా పనులు ఈవేసవిలో ఎక్కువగా చేపట్టేందుకు వీలుగా పనిని కోరుకునేవారందరికి జాబ్ కార్డులు మంజూరు చేసి వలసలు నిలువరించాలన్నారు. అదేవిధంగా సకాలములో వేతనాలు చెల్లింపులు చేస్తూ వారి కొనుగోలు శక్తిని పెంపొందించాలన్నారు. సర్వీసులు కోసం వచ్చే ధరఖాస్తులలో 80 శాతం మేర రెవిన్యూ విభాగానికి చెందినవే ఉంటాయని కులదృవీకరణ, ఆదాయ, నివాస దృవపత్రాలు రేషన్, బియ్యం కార్డులు భూమికి సంబందించిన ధ్రువపత్రాలు వంటివి ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటన్నింటికి సకాలములో పరిష్కారమార్గాలు చూపాలని ఆదేశించారు. గ్రామ వాలంటీర్లు సేకరించిన అన్నిరకాల అర్జీలను సర్వీసులు కోసం అందిన అర్జీలుగానే ఆన్ లైన్ లో డేటాఎంట్రీ చేయాలని స్పందన అర్జీలుగా భావించరాదన్నారు. సర్వీసులు కోరడం గిరిజనుల హక్కు అని ఆయన ఆన్నారు. పట్టాదారు పాస్ బుక్, ఆధార్ ఈకేవైసీ ఐటి సర్వీసులు, జనన మరణాల నమోదులు చేపట్టాలన్నారు. ప్రసుత్తం గ్రామ సచివాలయాలలో విద్యుత్ కనెక్షన్ కోసం మాత్రమే అవకాశం ఉందని, కాని విద్యుత్ బిల్లులు చెల్లింపులు కోసం సౌలభ్యం లేదని త్వరలో రానుందన్నారు. గంగవరం మండల డేటా మైదాన ప్రాంత కె.గంగవరం మండలానికి చేరుతుందని అధికారులు తెలుపగా పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు.గ్రామస్థాయిలో వ్యవస్థలు బలోపేతం కావాలని లేని పక్షములో ఆక్కడి సమస్యలు డివిజన్ కేంద్రానికి చేరతాయని ఆపరిస్థితులు రానీయవద్దని సూచించారు. ప్రజాసాధికార సర్వేకు రైస్ కార్డుకు లింకు తీసివేయడం జరిగిందన్నారు. పంటల సాగు నమోదు కార్డులు పొందినవారు రైతు భరోసాకు అర్హులన్నారు. మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా గ్రామా వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లలో భౌగోళిక సమాచారాన్ని ఒక నిర్దేశిత ప్రోఫార్మాలో 7 అంశాలపై నింపి సబ్ యూనిట్ అధికారికి సమర్పిస్తే వాళ్లు దోమల నివారణ చర్యలు చేపడతారన్నారు. పోస్టల్ సేవింగు ఖాతాలు ప్రారంభించమని, అందిన వాటిపై చర్యలు తీసుకొని ఖాతాలు ప్రారంభించాలని పోస్టల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు కోటేశ్వరరావు,సాయిబాబా ఎంపీడీవోలు,తాహశీల్దార్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us