Waltair Veerayya: పూనకాలు లోడింగ్.. మెగా మాస్ సాంగ్‌తో దిగిన వీరయ్య!

Updated 30th December 2022 Friday 6:40 pm

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పూనకాలు లోడింగ్’ సాంగ్‌ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు రిలీజ్ చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం నెక్ట్స్ లెవెల్‌లో ఇచ్చాడని మెగాస్టార్ ఇటీవల ఎందుకు అన్నాడో, ఈ పాట వింటే అర్థమవుతుంది. ‘పూనకాలు లోడింగ్’ పాటతో మెగాస్టార్ అండ్ టీమ్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింతగా పెంచేశారు.

ఇక ఇది మాస్ సాంగ్ కాదని.. మెగా మాస్ సాంగ్ అని దేవిశ్రీ పాట మొదట్లోనే చెప్పుకొచ్చాడు. ఈ పాటను రామ్ మిర్యాల, రోల్ రైడా పాడగా.. చిరు తనదైన గ్రేస్ స్టెప్పులతో మరోసారి రెచ్చిపోయారు. ఈ పాటలో మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చింది వాల్తేరు వీరయ్య టీమ్. ఈ పాటకు మెగాస్టార్ కూడా తన గొంతును కలిపాడు. ‘‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్..’’ అంటూ మెగాస్టార్ వాయిస్ ఈ పాటకు మరో అట్రాక్షన్. ఇక ఈ సాంగ్‌లో మెగాస్టార్, మాస్ రాజాలు కలిసి చేసిన డ్యాన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు నిజంగానే పూనకాలు తెప్పించడం ఖాయం.

దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్‌తో ‘వాల్తేరు వీరయ్య’ మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ మెగా మాస్ పూనకాలు లోడింగ్ సాంగ్‌ను మీరూ ఓసారి చూసేయండి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us