* ఏలూరు హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్
UPDATED 11th SEPTEMBER 2017 MONDAY 7:00 PM
ఏలూరు: అనాధలు, వృద్థులకు అండగా ఉంటామని ఏలూరు హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్ అన్నారు. సేవా కార్య క్రమాల్లో భాగంగా స్థానిక పత్తేబాదలోని నిశ్చింత నిరాశ్రయుల వసతి గృహంలోని అనాధలు, వృద్ధులకు వస్త్రాలు, మధ్యాహ్నభోజనం సోమవారం ఆయన చేతుల మీదుగా అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ రోజూ ఆనందంగా, సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో క్లబ్ తరుపున విస్తృతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిలోని భాగంగానే క్లబ్ సభ్యుల పిల్లల పుట్టిన రోజు వేడుకలను వృద్ధులు, అనాధల సమక్షంలో నిర్వహిస్తూ, వారికి సేవలు అందిస్తూ భోజనం, వస్త్రాలు అందచేస్తునట్లుగా పేర్కొన్నారు. అలాగే సంపాదించిన మొత్తంలో కొంత సొమ్మును పేదల సంక్షేమానికి వినియోగించాలన్నారు. అనాథలను ఆదుకోవడం మన భాద్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు. పేదలకు సేవలు అందిస్తున్న తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ కార్యదర్శి కడియాల విజయలక్ష్మి, సభ్యులు వడ్లపూడి కృష్ణమోహన్, యుయన్‌వి సత్యనారాయణ, విస్సాప్రగడ సురేష్, శివ నాగ పోతురాజు, కాట్రగడ్డ రఘువీర్, హారిక, కాట్రగడ్డ నయనిక కృష్ణ, నక్షత్ర సాయి తదితరులు పాల్గోన్నారు.







