రెడ్ బీ న్యూస్ 12 డిసెంబర్ 2021: సాధారణంగా మనం రోజూ వాడే కూరగాయల ధరలు ఎంతలా ఉంటాయి అన్న విషయంపై దాదాపుగా అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతివారం మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఏదైనా కూరగాయ కు సంబంధించిన ధర అడిగితే ఠక్కున చెప్పేస్తారు. ఇకపోతే ఇటీవల కాలంలో దాదాపు అన్ని కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఊహకందని రీతిలో భారీగా పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలోకొన్ని కూరగాయలు పండ్ల ధరలు ఊహించని రీతిలో పలుకుతూ ఉండటం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు గా అటు కూరగాయలు పండ్లలో కొన్ని పండ్లు ప్రత్యేకంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మన ఊర్లలో దొరికే దోసకాయ ఖరీదు ఎంత ఉంటుందో దాదాపు అందరికీ అవగాహన ఉంటుంది. మహా అయితే యాభై నుంచి వంద రూపాయల మధ్య ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దోసకాయ గురించి తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే దోసకాయ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలు. అవాక్కయ్యారు కదా.. కానీ ఇది నిజమే. ఇక ఈ దోసకాయలను సముద్ర దోసకాయలు అని చెబుతూ ఉంటారు. సాధారణంగా మనకు తెలిసిన దోసకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ సముద్ర దోసకాయ మాత్రం చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇక ఇలాంటి దోసకాయలను పట్టుకోవడం అంటే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందట. ఇక ఈ దోసకాయ లకు కొన్ని రోజుల నుంచి ఆసియాలో మంచి గిరాకీ ఉంటుంది. ఒక సంపన్న వర్గం కుటుంబాలను వీటిని ఆహారంగా స్వీకరించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1250 రకాల దోసకాయ ఉండగా వీటిలో జపనీస్ సముద్ర దోసకాయ ఎంతో ప్రత్యేకమైనది. అన్నిటితో పోల్చి చూస్తే ఈ దోసకాయలు అధికశాతం ప్రోటీన్స్ కలిగివుంటాయట. ఇక ఆసియాలోని చాలామంది ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి బాధపడుతున్న ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారట. ఐరోపాలో కొంత మంది ప్రజలు క్యాన్సర్ కు చికిత్స చేయడానికి కూడా దీనిని వాడుతూ ఉంటారట. రోజు రోజుకి సముద్ర దోసకాయ కు క్రేజ్ పెరిగిపోతుంది అని చెప్పాలి. అందుకే అటు ధర కూడా అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. వీటీకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటిలో కొన్ని జాతులు అంతరించిపోయే దశకు కూడా చేరుకున్నాయట







