UPDATED 18th FEBRUARY 2018 SUNDAY 10:00 PM
సామర్లకోట: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యమని అటువంటి వాటికి పాఠశాల వార్షికోత్సవం చక్కని వేదిక అని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి. అశోక్ అన్నారు. స్థానిక భాస్కర్ నగర్ లోని గౌతమి మోడల్ స్కూల్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో గౌతమి మోడల్ స్కూల్స్ చైర్మన్ ఎం. వెంకట నారాయణ మాట్లాడుతూ పిల్లల చదువులో తల్లుల పాత్ర కీలకమని అన్నారు. చదువు పట్ల తల్లిదండ్రులు ఇంటి వద్ద శ్రద్ధ తీసుకుంటే ఉత్తమ విద్యార్థులుగా తయారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఎంఈవో కె. వెంకట రమణమ్మ, పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షుడు గోలి అచ్చయ్య, కౌన్సిలర్ పాగా శిరీష, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.







