Chandrababu Naidu: ఖబడ్దార్ రౌడీల్లారా.. ఎక్కడదాక్కున్నా వదిలేది లేదు: చంద్రబాబు వార్నింగ్

Updated 28th May 2023  Sunday 8:20 pm

Chandrababu Naidu – TDP Mahanadu: వైసీపీ (YCP) నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖబడ్దార్ రౌడీల్లారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. గజదొంగల్లా పీడిస్తున్నారని చెప్పారు. అటువంటి వారు ఎక్కడదాక్కున్నా వదిలేది లేదని అన్నారు. రాజకీయ రౌడీలను హెచ్చరిస్తున్నానని చెప్పారు. ఏపీ(Andhra Pradesh)లోని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు.

టీడీపీని దెబ్బతీద్దామని ప్రయత్నాలు చేసి చాలా మంది విఫలమయ్యారని చంద్రబాబు చెప్పారు. రైతుల రుణమాఫీని ఎగ్గొట్టిన పార్టీ వైసీీపీ ఎన్టీఆర్ రూ.2కు కిలోబియ్యం ప్రవేశపెట్టారని అన్నారు. దీంతో దేశంలో ఆహార భద్రతను ప్రవేశపెట్టారని చెప్పారు. సంపద సృష్టించడం నేర్పిన పార్టీ టీడీపీనే అని అన్నారు.

ఒకేసారి రూ.50 వేల రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీనేనని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని తెలిపారు. ఏపీలో జగన్ పాలనలో ఇప్పుడు ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు. అమరావతికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు.

సమయం లేదు మిత్రమా అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు చంద్రబాబు. ఏపీలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే జగన్ ప్రభుత్వం పోయి టీడీపీ ప్రభుత్వం రావాలని అన్నారు. బాబాయ్ వివేకానందను చంపిన వారిని కొందరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

ఇంకా ఏమన్నారు?

అడ్డుకుంటూ పోతే తొక్కిపారేస్తాం
అన్నీ దోపిడే దోపిడి
ఇది క్యాస్ట్‌ వార్‌ కాదు క్యాష్‌ వార్‌
మెక్కిందంతా కక్కిస్తా..
తెలంగాణ ఆదాయం పెరగడానికి కారణం ఎవరు?
జాబు రావాలంటే మీరే రావాలన్నారు..
ఆ రోజే నేను చెప్పాను..
జగన్‌ పనైపోయింది..జీవితంలో మళ్లీ రాలేడు
మనది ప్రజాబలం, వాళ్లది ధనబలం
రేపు జరిగేది కురుక్షేత్ర యుద్ధం

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us