కట్టమూరులో తాటాకిల్లు దగ్ధం

UPDATED 18th OCTOBER 2020 SUNDAY 6:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకిల్లు దగ్ధమైన సంఘటన పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని రాజు గారి బీడు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష మేర ఆస్తి నష్టం సంభవించింది. కట్టా గణేష్, కట్టా వెంకటలక్ష్మికి చెందిన ఈ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురికావడంతో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, బట్టలతో పాటు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పేరూరి శ్రీనివాస్ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు.           

ads