బడుగు జీవుల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

UPDATED 28th NOVEMBER 2019 THURSDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): బడుగు జీవుల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ బడుగు, బలహీన తరగతుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని, భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పీడిత ప్రజల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా మనిషి అని అన్నారు. స్త్రీ విధ్య కోసం, అభివృద్ధి కోసం పనిచేసిన మహోన్నతుడని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.   

 

ads