అంగన్‌వాడీ కోడిగుడ్లు నిల్వపై విజిలెన్స్ అధికారుల విచారణ

జగ్గంపేట,11 నవంబరు 2020(రెడ్ బీ న్యూస్): అంగన్వాడీ కోడిగుడ్లు అక్రమంగా నిల్వ ఉంచారన్న విషయంపై విచారణను విజిలెన్స్ అధికారులు బుధవారం చేపట్టారు. గోకవరం రహదారిలో ఓషాపులో భారీగా అంగన్‌వాడీ కోడిగుడ్లు నిల్వ ఉంచిన విషయం తెలిసిందే. దీనిపై విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ విచారణ చేపట్టారు. అలాగే సీడీపీవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ads