తహశీల్దారుకు ఘనంగా ఆత్మీయ సత్కారం

గంగవరం:25 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): గంగవరం నుంచి దేవీపట్నం బదిలీపై వెళ్లిన తహశీల్దార్ ఎం.వీర్రాజుకు గురువారం రెవెన్యూ సిబ్బంది పూలమాలలు, దుశ్శాలువాతో ఘనంగా సన్మానం నిర్వహించారు. గంగవరంలో అన్ని శాఖల సమన్వయంతో ప్రతి పనిని ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించి మండలాన్ని ముందుంచడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగిందని పలువురు ఆయన సేవలను కొనియాడారు. ఆయన అందించిన సేవలను గుర్తించి రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య దేవిపట్నం బదిలీ చేయడం సంతోషం కలిగించిందని ఇన్చార్జ్ తహశీల్దార్ రామకృష్ణ అన్నారు. ఆయన వద్ద డీటీగా పనిచేసి ఆయన వద్ద నుంచే తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించడం తనకెంతో సంతోషంగా ఉందని, ఆయన మాదిరిగానే వీర్రాజు స్ఫూర్తితో మండలంలో పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ జిలాని,సీడీపీవో నీలవేణి, గృహ నిర్మాణశాఖ ఏఈ నాయుడు,తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
ads