విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలి

UPDATED 10th FEBRUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: కొంతమంది స్వార్థపరులు, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలను ప్రమాదంలోకి నెట్టేశారని ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆరోపించారు. ఈ నెల 19న అమరావతిలో నిర్వహించనున్న విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాదిగల విశ్వరూప మహా సభ పోస్టర్ ను ఆదివారం ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 35 లక్షల మంది మాదిగలకు విలువ లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరచిపోయారని విమర్శించారు. ఈ నెల 12వ తేదీన మాదిగ యువసేన ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వల్లూరి నాని, కాకినాడ డివిజన్ అధ్యక్షుడు డి. శ్రీను, జిల్లా నాయకులు మందపల్లి వెంకన్న, మండల అధ్యక్షులు నందిక చక్రం, గ్రామ అధ్యక్షుడు మోరంపూడి సూరిబాబు, వల్లూరి కృష్ణ, గొడత ఏసు, వల్లూరి చిట్టిబాబు, బత్తిన శ్రీను, గోడత రమణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads